శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:21 IST)

ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకున్న ప్రధాని మోడీ

modi dp
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకున్నారు. తన ప్రొఫైల్ పిక్‌గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్నారు. ఆగస్టు 2వ తేదీన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుక. అందువల్ల ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం వరకు త్రివర్ణ పతకాన్ని ప్రొపైల్ పిక్‌గా పెట్టుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ పిలుపు మేరకు ఆయన తొలుత తన ప్రొఫైల్ పిక్‌ను మంగళవారం ఉదయం మార్చారు. 
 
కాగా, "ఆజాదీకా అమృత్ మహోత్సవం" జరుపుకుంటున్న వేళ యూవత్ దేశం హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. భారత త్రివర్ణ పతాకాన్ని సంబరంగా జరుపుకునేందుకు సమిష్టి చర్యలు అవసరం. నా సోషల్ మీడియా పేజీల్లో డీపీని మార్చాను. మీరు కూడా అదే పని చేయాలి" అని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత షా, బీజేపీ చీఫ్ జీపీ నడ్డాలు తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. అలాగే, కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు.