గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (11:30 IST)

రామారావు ఆన్‌ డ్యూటీ రివ్యూ రిపోర్ట్

rama rao on duty
మాస్‌ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం రామారావు ఆన్‌ డ్యూటీ. యంగ్‌ డైరెక్టర్‌ శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్‌గా నటించారు.
 
భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 29) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల రామారావు డ్యూటీ ఎక్కేశాడు. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.  
 
రవితేజకు భారీ హిట్‌  లభించిందని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని , క్లైమాక్స్‌  అద్భుతంగా వుందంటున్నారు. ఇంకా చాలామంది రామారావు ఆన్‌ డ్యూటీ యావరేజ్‌ మూవీ అంటున్నారు.