శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (17:46 IST)

షాట్ గేప్‌లో బాల‌కృష్ణ - షాట్‌లో బాల‌కృష్ణ‌

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌న రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

 
గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న షూటింగ్‌లో జ‌నాలు తండోప‌తండాలు వ‌చ్చి జై బాల‌య్య అంటూ నిన‌దించారు. ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. ఓ స‌న్నివేశంలో క‌ర్నూలు మున్సిప‌ల్ కార్యాల‌యం నుంచి భారీ ర్యాలీతో బాల‌కృస్ణ వెంట వెళ్ళాల్సిన సీన్‌లో అక్క‌డి జ‌నాలే వారికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. 

 
ఇందులో బాల‌కృష్ణ రెండు పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఒక పాత్ర‌లో కార్మిక నాయ‌కుడిగా క‌నిపిస్తున్నాడు. మ‌రో పాత్ర‌లో వైట్ అంట్ వైట్ డ్రెస్‌తో రాజ‌కీయ‌నాయ‌కుడిలా క‌నిపిస్తాడు. ఈ సీన్ షాట్ గేప్‌లో స్నాక్స్ తింటున్న పిక్‌ను అభిమానులు పిక్ చేసి ఆనందం వ్య‌క్తం చేశారు.  మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో త‌మిళ‌న‌టులుకూడా న‌టిస్తున్నారు.