మంగళవారం, 4 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 నవంబరు 2025 (20:15 IST)

శ్వేతనాగుకు ఆపరేషన్.. పడగకు గాయం అయ్యింది.. వీడియో వైరల్ (video)

White Snake
White Snake
శ్వేతనాగుకు ఆపరేషన్ జరిగింది. విశాఖలో జరిగిన ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విశాఖపట్నంలో మల్కాపురం రోడ్డుపై ఓ వాహనం పాముపై నుంచి దూసుకెళ్లింది. నేవీ క్యాంటీన్ దగ్గర శ్వేతనాగును చూసిన ఉద్యోగులు స్నేక్ క్యాచర్ నాగరాజును పిలిపించి పామును పట్టించారు. 
 
పాముకు పడగ భాగంలో తీవ్ర గాయాన్ని చూసి వెంటనే హిందూస్థాన్ షిప్ యార్డ్ కాలనీలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెటర్నరీ డాక్టర్ సునీల్ కుమార్ ఆ పాముకు మత్తుమందు ఇచ్చి ఎనిమిది కుట్లు వేసి సర్జరీ చేశారు. గాయం తగ్గిన తర్వాత అడవిలో విడిచి పెడతామని తెలిపారు.
 
విశాఖపట్నం సింధియా పరిధిలోని నేవీ క్యాంటీన్‌ సమీపంలో అరడగుల శ్వేత నాగు కనిపించింది. స్థానికుల అరుపులతో పాము అక్కడే ఉన్న ఓ అట్ట డబ్బాలో దూరింది. 
 
ఈ క్రమంలో పడగ విప్పిన శ్వేత నాగును గమనించిన అతడు.. దాన్ని పడగపై గాయాలు ఉండటాన్ని గమనించాడు. వైద్యాధికారి సీహెచ్‌ సునీల్‌కుమార్‌ పాముకు మత్తు మందు ఇచ్చి గాయానికి శస్త్ర చికిత్స చేశారు.