సంబంధిత వార్తలు
- అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా
- పాము కాటేసిందని దాని తల కొరికి పక్కన పెట్టుకుని నిద్రపోయాడు...
- బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్
- స్నానాల గదిలో 16 అడుగుల గిరి నాగుపాము, స్నేక్ క్యాచర్స్ క్యాచ్ (video)
- వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ
ఆపరేషన్ చేసి పాము ప్రాణం పోసిన వెటర్నరీ డాక్టర్ (వీడియో)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ వెటర్నరీ వైద్యుడు పాముకు వైద్యం చేశారు. ఈ పాము గాయపడటంతో దానికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడాడు. సాధారణంగా పాము కనిపిస్తే అనేక మంది భయపడిపోతారు. లేదా దాన్ని చంపేందుకు చూస్తారు. కానీ, ఈ వైద్యుడు చేసిన పనికి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు.
జిల్లాలోని చంద్రంపేట గ్రామానికి చెందిన కాటిపాములకు చెందిన వ్యక్తి ఇంటిలో ఉన్న పాముపై గడ్డపార పడింది. దీంతో ఆ పాము పొట్టలోనుంచి పేగులు బయటకు వచ్చాయి. దీంతో ఆ ఇంటి యజమాని సిరిసిల్ల పశువైద్యాధికారి అభిలాష్‌ను సంప్రదించగా, ఆయన ఆ పాముకు ఆపరేషన్ చేసి పేగులను తిరిగి యధాతథ స్థితిలో అమర్చి, ఆరు అంగుళాల మేరకు కుట్లు వేశారు. ఈ పామును మూడు రోజుల పాటు పరిశీలనలో ఉంచి చికిత్స అందిచారు. ప్రస్తుతం ఈ పాము ఆరోగ్యంగా ఉందని డాక్టర్ చెప్పారు.
పాముకు వైద్యం చేసిన వెటర్నరీ డాక్టర్
— ChotaNews App (@ChotaNewsApp) September 24, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గాయపడిన పాముకు ఒక వెటర్నరీ డాక్టర్ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. సాధారణంగా పాములను చూస్తే భయపడే ప్రజలు, డాక్టర్ చేసిన ఈ పనికి అవాక్కయ్యారు. చంద్రంపేట గ్రామానికి చెందిన కాటిపాములకు… pic.twitter.com/xity40Turj
