గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (10:55 IST)

ఇల్లు మారనున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?

Nandamuri Balakrishna
నందమూరి నటసింహం బాలయ్య ఇల్లు మారుస్తున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తన సొంత ఇంటిని ఖాళీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య సొంత ఇళ్లు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లిహిల్స్ చెక్‌పోస్టు దాటాక చంద్రబాబు ఇళ్లు లైన్ దాటక పెట్రోల్ బంక్‌ను ఆనుకునే ఉంది. 
 
ఇది అత్యంత రద్దీ ప్రాంతం. జూబ్లిహిల్స్ నుంచి జర్నలిస్టు కాలనీకి వెళ్లే మార్గంలోనే ఈ ఇళ్లు ఉంటుంది. అసలు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రాంతం అంతా వాహనాల హారన్లతో మోగుతూనే ఉంటుంది.
 
అలాగే విపరీతమైన వాయు కాలుష్యంతో పాటు సౌండ్ పొల్యుషన్ వల్ల ఇంటిని ఖాళీ చేయాలని బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. 
 
బాలయ్య పగలంతా షూటింగ్ చేసి ఉంటాడు. నైట్ అయితే నిద్రకు ఉపక్రమించినా ఇక్కడ ధ్వని కాలుష్యంతో ఇబ్బందిగా ఉంటుందని ఫీలవుతున్నట్టు కూడా తెలుస్తోంది.
 
ఈ క్రమంలోనే ఈ ఇంటిని వదిలేసి గచ్చిబౌలిలో తనకు ఉన్న విల్లాకు మారిపోయే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఉంటోన్న ఇంటి స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. బాలయ్య ఇళ్లు మారిపోతే ఆ ఇంటిని పడగొట్టేసి అక్కడ ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తారని అంటున్నారు. 
 
నిజం చెప్పాలంటే బాలయ్య ఇప్పుడు ఉండే ఇంటి ప్రాంతం షాకింగ్ కాంప్లెక్స్‌లకు, సినిమా థియేటర్లకు ఎంతో అనువైన ప్రాంతం.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ ఇళ్లు ఉంది. 
 
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో పాటు అన్‌స్టాపబుల్ షోతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మలినేనీ గోపీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తన 107వ ప్రాజెక్టులో నటిస్తున్నాడు.