ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (00:20 IST)

కడక్ నాథ్ కోళ్లను అమ్మేందుకు రెడీ అంటోన్న ధోనీ

Kadaknath
రాంచీలో ఫాంహౌస్ నెలకొల్పి కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కడక్ నాథ్ కోడి పోషకాలతో కూడుకున్నది. పైగా ధర కూడా ఎక్కువే. కిలో కోడికి రూ. 800 నుంచి వెయ్యి వరకు ధర కూడా పలుకుతోంది. దీని మాంసం కూడా వెరైటీగా ఉంటుంది. కలర్ నల్లగా ఉంటుంది. దీంతో వీటి మాంసానికి విలువ ఎక్కువ. 
 
ధోని తన ఫాంహౌస్‌కు వచ్చి తీసుకెళ్లే వారికే కోళ్లు అమ్మేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కడక్ నాథ్ కోళ్లంటే ఎక్కడా దొరకవు. అవి మధ్యప్రదేశ్‌లో మాత్రమే దొరుతుతాయి. 
 
గత ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ నుంచి కడక్ నాథ్ కోడిపిల్లలను సుమారు రెండువేలు తీసుకొచ్చి ఫాం హౌస్‌లో వేశాడు. ఇప్పుడు అవి 800 గ్రాముల నుంచి కిలో వరకు పెరిగాయి. దీంతో వాటిని విక్రయించాలని ధోని భావిస్తున్నాడు. కేజీ ధర రూ. 800 నుంచి వెయ్యి వరకు అమ్మాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కానీ మార్కెట్ కు తరలించి అడ్డగోలు ధరలకు కాకుండా సరసమైన ధరలకు ప్రజలకు నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేశాడు. దీంతో వాటిని నేరుగా ప్రజలకు అందించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు ధోని తన ఫాంహౌస్ లో ఈసారి కూరగాయలు కూడా పెంచుతున్నాడు. టమోటాలతో పాటు వంకాయలు ఇతర కూరగాయలను సేంద్రియ ఎరువులతోనే పండిస్తూ ప్రజలకు ఆరోగ్యం కలిగించేందుకు సిద్ధమయ్యాడు.