సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (14:58 IST)

జూలై నెలలో నథింగ్ ఫోన్ 1 లాంఛ్

Smart phone
ప్రముఖ మొబైల్ కంపెనీ నథింగ్ నుంచి తొలి మొబైల్ ఫోన్ జూన్ ఒకటో తేదీ నుంచి విడుదలకానుంది. దీంతో ఈ ఫోన్‌పై టెక్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. నథింగ్ ఫోన్ 1 నుంచి తొలి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం గమనార్హం. ఈ ఫోన్ లాంచ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది. జూలై 12వ తేదీన నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్‌ను లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించింది. 
 
ఇదే విషయంపై నథింగ్ ఫోన్ కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్పందిస్తూ, తమ ఫోనును వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ ఫోనులో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. రిఫ్రెష్ డిజైన్‌ను అందిస్తామని కార్ల్ పీ ఇప్పటికే ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో నథింగ్ స్మార్ట్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు, ధరల వంటి వివరాలు లీకయ్యాయి. నథింగ్ ఫోన్ 1 మొబైల్ లాంచ్ ఈవెంట్ లండన్‌లో జూలై 12వ తేదీన రాత్రి 8.30 గంటలకు ఆరంభమవుతుందని, ఆ సమయంలో ఫోనులో ఉండే అన్ని ఫీచర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
ముఖ్యంగా నథింగ్ ఫోన్ 1లో ఉన్న ఫీచర్లను బట్టి చూస్తే మార్కెట్ ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్యలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.