సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (17:20 IST)

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడుగా స్పీకర్ మహీందా అభేవర్థనే

Sri Lanka-Agitation
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆ దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో కొలంబోలోని లంక అధ్యక్ష భవనానికి క్యూ కట్టారు. ఆందోళనకారుల ఆగ్రహాన్ని పసిగట్టిన అధ్యక్షుడు గొటబయి రాజపక్సే శుక్రవారం రాత్రే గుట్టుచప్పుడు కాకుండా అధ్యక్ష భవనం పారిపోయారు. అలాగే, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు విక్రమ సింఘే ప్రకటించారు.
 
ఈ నేపథ్యంలో అన్ని పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయి. ఇందులోభాగంగా లంక అధ్యక్షుడుగా మహీందా అబేవర్థనే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈయన ఆ దేశ పార్లమెంట్‌ స్పీకరుగా ఉన్నారు. 
 
కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పీకర్ అభేవర్థనే నివాసంలో పలు రాజకీయ పార్టీల నేతలు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం ప్రకారం ఆపద్ధర్మ దేశాధినేతగా స్పీకర్ బాధ్యతలు చేపట్టాల్సివుంటుంది. వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయం మేరకు ఆయన దేశ తాత్కాలిక అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు.