శుక్రవారం, 18 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జులై 2025 (17:42 IST)

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

ktr flexi
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలతో వెలసిన ఫ్లెక్సీలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. "3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా.. కాంగ్రెస్ నేతలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం" అంటూ అందులో రాసివున్నారు. ఈ ఫ్లెక్సీలను ఖమ్మం పట్టణంలో కట్టారు. పైగా, పలువురు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీల ముందు నిల్చొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 
 
మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే భారత రాష్ట్ర సమితి ఏకంగా వంద సీట్లలో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందన్నారు. రేవంత్ రెడ్డి వంటి దుర్మార్గులు ఉంటారని అంబేద్కర్ కూడా ఊహించలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రతి ఒక్కరినీ ప్రతి రంగాన్ని మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.