సంబంధిత వార్తలు
- Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప
- సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్
- చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్
- ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్
- KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్
కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి కేటీఆర్‌కు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అల్టిమేటం జారీచేసింది. ఫోన్, ల్యాప్‌టాప్ ఇవ్వాల్సిందేనని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం వరకు గడువు విధించారు. మరోవైపు, కేటీఆర్ కూడా ఏసీబీ ఇచ్చిన అల్టిమేటం, గడువుపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ అంశంలో భారీగా నిధులను దారిమళ్లించారనే అభియోగాలను కేటీఆర్ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్‌లను సంయుక్తంగా విచారించాలని ఏసీబీ అధికారులు బావిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్.. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. ఆయన ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. ఆయన వచ్చిన తర్వాత వారం రోజుల్లోగా ఇద్దరినీ ఉమ్మడిగా విచారించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది.
