మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (13:04 IST)

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం

chandrababu
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటి సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు పిలుపు వచ్చింది. దీంతో ఈ నెల 6వ తేదీన ఆయన హస్తినకు వెళ్లనున్నారు. 
 
ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటరులో జరిగే ఈ సమావేశంలో 75 యేళ్ళ స్వాతంత్ర్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికోసం నిర్వహిచే సన్నాహక సమావేశంలో చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. 
 
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీల మధ్య స్నేహం చెడింది. దీంతో చంద్రబాబుకు, నరేంద్ర మోడీకి మధ్య గత మూడేళ్లుగా మాటలు లేవు. ఈ క్రమంలో తన సారథ్యంలో జరిగే ఈ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.