సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (14:11 IST)

ప్రముఖ కన్నడ గాయకుడు శివమొగ సుబ్బన్న మృతి

Shivamogga Subbanna
Shivamogga Subbanna
ప్రముఖ కన్నడ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ సుబ్బన్న (83) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బన్న గురువారం రాత్రి బెంగళూరులోని జయదేవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
 
సుబ్బన్న మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సుబన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆయన అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో పార్థీవదేహాన్ని ఉంచనున్నారు.
 
సుబ్బన్న అసలు పేరు జి.సుబ్రమణ్యం. 1938లో శివమొగ్గ జిల్లాలోని నగర్‌ గ్రామంలో జన్మించారు.' కాడు కుదురె' చిత్రంలోనే 'కాడు కుదురె ఒడి బండిట్టా' అనే పాటకు 1979లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా రజత కమలం అవార్డును సుబ్బన్న అందుకున్నారు. శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా సుబ్బన్న ప్రత్యేక గుర్తింపు పొందారు.