సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (13:44 IST)

కర్నాటకలో యువ నటుడు దారుణ హత్య

murder
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. యువ నటుడు సతీష్ వజ్ర దారుణ హత్యకు గురయ్యాడు. బెంగుళూరు, ఆర్ఆర్ నగరులోని తన నివాసంలోనే ఈ హత్య జరగడం గమనార్హం. ఆయన బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 
ఈ యువ నటుడు వజ్ర భార్య మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తన అక్క మృతికి బావ వజ్రనే కారణమని బావమరిది మనస్సులో నాటుకునిపోయింది. దీంతో బావను బావమరిది చంపేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.