బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (12:12 IST)

డ్యాన్స్ చేస్తూ జారిపడిన రాధిక కుమారస్వామి

radhika kumaraswamy
సోషల్ మీడియాలో హీరోయిన్స్ యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. తాజాగా రాధికా కుమారస్వామి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2002లో నీలా మేఘ శమ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది రాధిక. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించింది. 
 
రాధిక మొదటి భర్త రతన్ కుమార్ ఆగస్ట్ 2002లో గుండెపోటుతో మరణించారు. 2010 నవంబర్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని రెండవ వివాహం చేసుకుంది.
 
ఈ నేపథ్యంలో తన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుంది. తాజాగా రాధిక తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమె ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చెస్తూ కుప్పకూలింది.
 
ఆ వీడియోలో తన జిమ్ ట్రైనర్‏తో కలిసి జిమ్‏లో ఎంతో ఎనర్జీతో డ్యాన్స్ చేస్తుంది. మాస్ స్టెప్పులతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఆమె.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడింది. గతంలో రాధిక డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇంతకు ముందు బీచ్‌లో బాద్షా పాట జుగ్నుకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది.