శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (09:37 IST)

వికటించిన దంత వైద్యం - అందవిహీనంగా నటి స్వాతి

swathi sathish
కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన నటి స్వాతి సతీష్‌ చేయించుకున్న దంతవైద్య వికటించింది. దీంతో ఆమె ముఖం బాగా వాచిపోయింది. దీంతో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పలు కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన స్వాతి సతీష్ ఇటీవల దంతాలకు రూట్ కెనాల్ వైద్యం చేయించుకున్నారు. ఈ చికిత్స తర్వాత ఆమె ముఖం బాగా వాచిపోయింది. ఫలితంగా ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. 
 
మరోవైపు, ఈ చికిత్స కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, బెంగుళూరు నగరంలోని ఓ ప్రైవేట్ డెంటల్ క్లినిక్‌లో తాను రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నట్టు చెప్పారు. చికిత్స సమయంలో అనస్తీషియా ఇచ్చేటపుడు వేరే మందు (సాల్సిలిక్ యాసిడ్) ఇచ్చి ఉంటారని, అందువల్లే ఇలా ముఖం వాచిపోయివుంటుందని ఇతర వైద్యులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. తాను పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ డెంటల్ క్లినిక్‌పై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.