శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:24 IST)

కన్నడ నటి సౌజన్యది ఆత్మహత్యే.. తేల్చేసిన పోస్టుమార్టం రిపోర్ట్

బెంగళూరులోని కుంబళగోడులోని తన ఇంట్లో గత నెల 30న సౌజన్య విగతజీవిగా కనిపించింది. సౌజన్య ఆత్మహత్య వార్త కన్నడ టెలివిజన్ రంగాన్ని కుదిపేసింది. దీంతో ఆమె తండ్రి తన కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె స్నేహితుడు వివేక్‌ను విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. టి సౌజన్యది ఆత్మహత్యగా వైద్యుల నివేదికలో వెల్లడైంది. 
 
25 ఏళ్ల సౌజన్యది కొడుగు జిల్లాలోని కుశాల్ నగర్ కాగా వృత్తిపరంగా బెంగళూరులో ఉంటోంది. అనారోగ్యపరమైన సమస్యలతోపాటు టెలివిజన్ రంగంలోనూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆత్మహత్యకు ముందు రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మూడు వేర్వేరు తేదీలతో అంటే సెప్టెంబరు 27, 28, 30 తేదీలలో ఆ నోట్ రాసినట్టుగా ఉంది.
 
తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు సౌజన్య స్నేహితుడు వివేక్‌ను విచారించారు. కాగా, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తాజాగా నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. సౌజన్య పలు సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించింది.