గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:01 IST)

కన్నడ, హిందీ భాషల్లో ఎస్వీబీసీ ఛానెళ్లను ప్రారంభించిన సీఎం జగన్

కన్నడ, హిందీ భాషల్లో ఎస్వీబీసీ ఛానెల్‌ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. తిరుప‌తిలోని అలిపిరి నుండి తిరుమ‌ల జిఎన్‌సి టోల్ గేట్ వ‌ర‌కు పున‌ర్నిర్మించిన న‌డ‌క‌మార్గం పైక‌ప్పును ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి జగన్ కు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు. 
 
తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని కూడా ప్రారంభించారు. తిరుప‌తిలోని అలిపిరి నుండి తిరుమ‌ల జిఎన్‌సి టోల్ గేట్ వ‌ర‌కు పున‌ర్నిర్మించిన న‌డ‌క‌మార్గం పైక‌ప్పును సోమ‌వారం ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు.  
 
సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్నారు. నగరంలోని బర్డ్ ఆసుపత్రిలో చిన్న పిల్లల హృద్రోగాల చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ విజయవాడ నుంచి ఈ మధ్యాహ్నం తర్వాత బయల్దేరి తిరుపతి విచ్చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి, వెల్లంపల్లి, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రేపు తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.