గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 11 అక్టోబరు 2021 (15:44 IST)

సాంప్రదాయం పాతదే, సిఎం మాత్రం కొత్తగా పట్టువస్త్రాలను సమర్పిస్తూ...

తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరు సిఎంగా ఉన్నా సరే పట్టువస్త్రాలను ప్రతియేటా సమర్పిస్తుంటారు. అయితే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజే సాధారణంగా పట్టువస్త్రాలను ఇస్తుంటారు. 
 
కానీ భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఆనవాయితీగా భిన్నంగా పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట్లో ఆయన బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే పట్టువస్త్రాలను ఇచ్చేసి వెళ్ళేవారు. ఆ తరువాత గరుడసేవ యథావిథిగా జరిగేది.
 
కానీ ఈ యేడాది మాత్రం ఆనవాయితీ ప్రకారమే ఎపి సిఎం పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి పట్టువస్త్రాలను శిరోధార్యం చేసి ఊరేగింపుగా సిఎం ఆలయంలోకి తీసుకెళ్ళారు.
 
వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ఆలయంలోనే పట్టువస్త్రాలను సమర్పించారు. అలాగే వేంకటేశ్వరస్వామిని సిఎం దర్సించుకున్నారు. ఆలయంలో సిఎంకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. 
 
సిఎం వెంట మంత్రులతో పాటు పలువురు స్థానిక నేతలు కూడా ఉన్నారు. బ్రహ్మోత్సవాలు గత యేడాదిగా కూడా కరోనా కారణంగా ఏకాంతంగానే టిటిడి నిర్వహించింది.