శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (09:03 IST)

శ్రీవారి బ్రహ్మోత్సవాలు : నేడు చిన్నశేష వాహనంపై మురళీ మనోహరుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో శ్రీ మ‌ల‌యప్పస్వామి పెదశేష వాహనంపై ఊరేగారు. ఇక రెండో రోజైన శుక్రవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనసేవలను నిర్వహిస్తారు. 
 
అయితే, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీవారికి చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. చిన్నశేషవాహనంపై వెంకటేశ్వరుడు మురళీ మనోహారుడు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
 
ఇక రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాసుడు హంస వాహనంపై కొలువు తీరుతారు. కరోనా ప్రభావంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆలయంలోని కల్యాణమండపంతో వాహన సేవలను నిర్వహిస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 15న ముగియనున్నాయి.