1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 జులై 2025 (16:09 IST)

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

Hanuman
పగడ ఆంజనేయుని పూజించడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. పగడపు ఆంజనేయుడిని పూజిస్తుంటే ఇంట్లో వున్న ప్రతికూల శక్తులు తొలగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఈ పగడ హనుమంతుని ఆలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పట్టణాలలోనూ దర్శనమిస్తుంటాయి. హనుమంతుడిని ఆంజనేయాయ విద్మహే, వాయుపుత్రాయ ధీమహీ, తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అని ప్రార్థిస్తే ఆరోగ్యం, ధైర్యం కలుగుతాయి
 
విద్యాప్రాప్తి కోసం
పూజ్యాయ, వాయు పుత్రాయ వాగ్దోష వినాశన, సకల విద్యాంకుర మే దేవ రామదూత నమోస్తుతే అని ప్రార్థించాలి.
 
ఉద్యోగ ప్రాప్తి కోసం
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వాపీడా వినాశినే, ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే అని కీర్తించాలి.