సంబంధిత వార్తలు
- సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?
- యాక్సిడెంట్ లో చనిపోయిన వారు తిరిగి వస్తే ఏమంయిందనేదే రుద్ర గరుడ పురాణం
- మతమార్పిడులకు పాల్పడితే 20 యేళ్ల జైళ్ళు...: చట్టం తెచ్చిన యోగి సర్కారు
- బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?
- శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?
గరుడ పురాణం: 28 రకాల నరకాలుంటాయట.. ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి
Garuda Purana
విష్ణు భగవానుడు తన వాహనమైన గరుడునికి బోధించే సంభాషణలాగా ఈ పురాణం ఉంటుంది. మానవులు నిజాయితీగా సన్మార్గంలో జీవించాలి. పాపాలకు దూరంగా వుండాలి. ధర్మ శాస్త్రాన్ని అనుసరించి గరుడ పురాణం ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.
దొంగతనం చేసేవారు, దోచుకునేవారు, ఇతరులను మోసం చేసి తమ ఆస్తులను, సంపదలను పొందే వ్యక్తులు సారమేయాసనం శిక్షకు గురవుతారని నమ్మకం. ఈ నరలో తమ సామాజిక విధులను నిర్వర్తించని, సమాజాన్ని అగౌరవపరిచే వ్యక్తులకు చోటు. సారమేయాసనంలో ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి చేస్తాయి. ఇక్కడ జంతువులు ఆత్మ శరీరాన్ని పదే పదే చీల్చివేస్తాయని చెబుతారు.
గరుడ పురాణంలో, ఇతరుల వస్తువులను దొంగిలించడం, అపహరించడం చేయకూడదు. ఇది నేరం కింద వస్తుంది. ఈ పాపాలను చేసే వారికి మరుజన్మలో కష్టాలు తప్పవు. మరుజన్మలో వారు తమ జీవితాంతం ఆహారం, నీరు కోసం పోరాడవలసి వుంటుంది. దారిద్ర్యం వారిని వరిస్తుంది.
యమలోకంలో వీరికి తప్త కుండల, సుర్మి వంటి నాగులతో ఇబ్బందులు తప్పవు. అసత్యం పలకకూడదు. వదంతులు వ్యాప్తి చేయకూడదు. ఇలా చేస్తే నోటి మాటరాకపోవడం వంటి శిక్షలు తప్పవు. వాస్తవానికి వివిధ పాపాలకు సంబంధించిన 28 రకాల నరకాలు, శిక్షలు గరుడ పురాణంలో ప్రస్తావించారు.
