శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 7 జనవరి 2021 (14:03 IST)

ప్రియుడి కోసం పెళ్లి పీటలెక్కిన ఇద్దరు ప్రియురాళ్లు

అతడు ఒకర్ని కాదు... ఇద్దర్ని పడేశాడు ప్రేమలో. ఒకరికి తెలియకుండా మరొకరుతో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి మాట వచ్చేసరికి ఎవరిని వదిలేయాలో తెలియక సందిగ్ధంలో పడ్డాడు. అసలు విషయాన్ని ప్రియురాళ్లిద్దరికీ చెప్పేశాడు. ఇద్దరూ కావాలన్నాడు. అంతే... ఆ అమ్మాయిలు వారివారి పెద్దలతో మాట్లాడి తమ ప్రియుడిని పెళ్లాడతామన్నారు. అందుకు పెద్దలు కూడా అంగీకరించడంతో అమ్మాయిలిద్దరూ పెళ్లి పీటలపైకి ఎక్కారు. ప్రియుడితో ఇద్దరూ తాళి కట్టించుకున్నారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మౌర్య అనే యువకుడు 21 ఏళ్ల సుందరి, 19 ఏళ్ల హసీనాతో ప్రేమ సాగించాడు. పెళ్లి దగ్గరకొచ్చేసరికి విషయాన్ని ఇద్దరితో చెప్పాడు. వారివురు పెద్దలను ఒప్పించి మౌర్యను పెళ్లాడారు. ఈ పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో పాటు ఊరు ఊరంతా వచ్చి ఆశీర్వదించింది. అదేమని అడిగితే.. మా ఆచారంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడటం తప్పేమీ కాదని లైట్ తీసుకోమని చెపుతున్నారు.