గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (11:44 IST)

పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం చేయించిన కొత్త జంట

పెళ్లికి వచ్చిన అతిథులతో కొత్త జంట రక్తదానం చేయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. ఇంతకీ అసలు ఎందుకీ రక్తదానం చేసారు?
 
పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్‌ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దయాసాగర్ వివాహం అదే పట్టణానికి చెందిన పద్మసాయి కృష్ణవేణితో ఆదివారం రాత్రి 10.35 గంటలకు జరిగింది. ఐతే ఈ పెళ్లికి వచ్చినవారు తమను ఆశీర్వదించడంతో పాటు రక్తదానం కూడా చేయాలని వరుడు దయాసాగర్ కోరాడు.
 
దయాసాగర్ విన్నపాన్ని మన్నించిన బంధుమిత్రులు నవ దంపతులను ఆశీర్వదించి ఆ తర్వాత రక్తదానం ఇచ్చారు. తన అభ్యర్థన మేరకు రక్తదానం చేసిన 35 మంది బంధుమిత్రులకు అభినందన తెలియజేసింది కొత్త జంట. కాగా రక్తదానం చేయించిన వరుడు దయాసాగర్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.