సోమవారం, 4 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:38 IST)

కన్నడ హాస్య నటుడు శంకర్ రావు మృతి

కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ (72) ఆదివారం తెల్లవారు జామున బెంగుళూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికితా పొందుతూ మరణించారు.
 
తాజాగా కన్నడ చిత్రసీమకు చెందిన మరో హాస్యనటుడు శంకర్‌ రావు (84) అనారోగ్యంతో సోమవారం ఉదయం బెంగళూరుతో కన్నుమూశారు. 'పాప పాండు' సీరియల్‌ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న మృతి క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర విషాదంలో నెట్టింది. శంక‌ర్ రావు మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.