మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (23:25 IST)

బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్?

Bigg boss
బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆసక్తికరంగా సాగుతోంది. గత వారం అంటే సెప్టెంబర్ 4వ తేదీ అంటే శనివారం నాడు ప్రారంభమైన ఈ షో మొదటి వారం చివరికి చేరింది.
 
శనివారం నాడు నాగార్జున హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి అందరితో వారం మొత్తం జరిగిన విశేషాల గురించి చర్చించడమే కాక ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వారం మొత్తం ఏడుగురు హౌస్ మేట్స్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.
 
ఆ ఏరుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో ఇనయా సుల్తానా, అభినయశ్రీ, ఫైమా, శ్రీ సత్య, ఆరోహి రావు, చలాకీ చంటి, సింగర్ రేవంత్ ఉన్నారు. ఇక నిన్న అర్ధరాత్రితో మొదటి వారం బిగ్ బాస్ ఓటింగ్ ముగిసింది. 
 
ఈ ఏడుగురిలో మొదటి వారంలో ఒకరు బయటకు రాబోతున్నారని, వారిలో ఇనయా సుల్తానా కానీ ఆరోహి రావు కానీ అభినయశ్రీ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.
 
ఇక శనివారం నాడే శని ఆదివారాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇక బిగ్ బాస్ లీక్స్ ప్రకారం మొదటి వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదని తెలుస్తోంది. మరి ఈ వారం ఎలిమినేషన్ సంగతేంటో తెలియాలంటే వేచి చూడాలి.