సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (22:59 IST)

సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు మీ వార రాశిఫలాలు (video)

Weekly astrology
Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
గ్రహాల అనుకూలత ఉంది. చిత్తశుద్ధిని చాటుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదివారం నాడు ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు కష్టకాలం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. వ్యతిరేకించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. అవసరాలకు సర్దుబాటవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సోమ, మంగళ వారాలో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. కొత్త వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వృత్తుల వారికి నిరాశాజనకం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఈ వారం అనుకూలదాయకం. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృషినిస్తాయి. ఓర్పు, పట్టుదలతో ఉద్యోగయత్నాలు సాగించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, శ్రమ అధికం. 
 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రభాసం. అవకాశాలు చేజారిపోతాయి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. బుధ, గురు వారాల్లో అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. శుక్ర, శని వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. నోటిసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సంతానం విషయాలో మంచి జరుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహనిర్మాణాలకు అడ్డంకులు తొలుగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రింటింగ్, కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు కొత్త బాధ్యతలు, స్థానచలనం. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. సోమ, మంగళ వారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మీ చొరవతో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ద్విచక్రవాహన చోదకులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ప్రతికూలతలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బుధవారం నాడు పత్రాలు, నగదు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోతహకరంగా సాగుతాయి. కార్మికులు, బిల్డర్లకు ఆశాజనకం. ప్రైవేట్ సంస్థల ఉద్మోగస్తులకు కష్టకాలం. ఆధ్మాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక, దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. మీ కష్టం వృధాకాదు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురు, శుక్ర వారాల్లో పొగిడేవారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆర్థికస్థితి ఆశాజనకం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఖర్చులు భారమనిపించవు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్ లో ఏకాగ్రత వహించండేఇ. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు హోదామార్పు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆది, సోమ వారాల్లో పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పత్రాల రెన్యువల్ లో అలక్ష్యం తగదు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి.