ఎలిజబెత్ రాణి అంత్యక్రియలు ఎపుడో తెలుసా?
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం రాత్రి అనారోగ్యంతో పాటు వృద్దాప్య సమస్యలతో కన్నుమూశారు. బ్రిటన్ రాణిగా కొన్ని దశాబ్దాల పాటు ఆమె ఉన్నారు. దీంతో ఆమె అంత్యక్రియలు కూడా అంతే ఘనంగా నిర్వహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాణి భౌతికకాయాన్ని ఉంచిన పేటికతో పాటు బ్రిటన్ రాజు కుటుంబ సభ్యులు వెంటరాగా వెస్ట్ మినిస్టర్ బ్బేకు తరలించనున్నారు. అక్కడ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. ఆ తర్వాత శవపేటికను విండ్సర్ కోటకు తీసుకెళారు. అందులో సెయింట్ జార్జ్ చాపెల్ (చర్చి)కు తరలించి, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియల తంతు పూర్తి చేస్తారు.
ఆ తర్వాత కింగ్ జార్జ్-4 మెమోరియల్ చాపెల్‌లో ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి పక్కన ఆమె శవపేటికను ఖననం చేస్తారు ఈ అంత్యక్రియలు ఈ నెల 19వ తేదీన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.