బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:51 IST)

రాజు పాలనలోకి బ్రిటన్ - క్వీన్ ఎలిజబెత్-2 పెద్ద కుమారుడికి పట్టాభిషేకం

charless
రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్ ఇకపై రాజు పాలనలోకి వెళ్లనుంది. బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం రాత్రి 96 యేళ్ల వయసులో అనారోగ్యం, వృద్దాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. దీంతో బ్రిటన్ రాజుగా ఆమె నలుగురు పిల్లల్లో పెద్దవారైన చార్లెస్ కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రిటన్ రాజకుటుంబ నియమాల ప్రకారం బ్రిటన్ దేశాధినేత మరణిస్తే వారి మొదటి వారసులు, వారసులు రాణి లేదా రాజుగా మారిపోతాడు. అయితే, అధికారంగా పట్టాభిషేకం, ఇతర లాంఛనాలు పూర్తి చేసేందుకు మాత్రం కొన్ని నెలల సమయం పడుతుంది. 
 
ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్-2 మరణించడంతో ఆమె పెద్ద కుమారుడైన 72 యేళ్ల చార్లెస్ బ్రిటన్ కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన కింగ్ చార్లెస్-3గా వ్యవహరిస్తారు. దేశాధినేత మరణించిన 24 గంటల్లోనే లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి యాక్సెషన్ కౌన్సిల్ అధికారికంగా కొత్త దేశాధినేత పేరును ప్రకటిస్తుంది. ఆ తర్వాత కొత్త రాజుకు బ్రిటన్ పార్లమెంట్ విధేయత ప్రకటిస్తారు. కొత్త ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ విషయాన్ని బ్రిటన్ బహిరంగంగా ప్రకటిస్తుంది. 
 
కాగా, ఆయన గతంలోనే వేల్స్‌కు యువరాజుగా వ్యవహరించారు. ఇపుడు బ్రిటన్‌కు మూడో రాజుగా త్వరలోనే పట్టాభిషిక్తుడు కానన్నారు. అలాగే, 14 కామన్వెల్త్ దేశాకు కూడా ఆయనే రాజుగా వ్యవహరిస్తారు. గత 1948లో నవంబరు 14వ తేదీన చార్లెస్ బకింగ్‌హ్యామ్ ప్యాలెస్‌లో జన్మించారు. 
 
క్వీన్ ఎలిజబెత్‌-2కు నలుగురు పిల్లల్లో ఆయనే పెద్దవారు. చార్లెస్‌ 1981లో డయానాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు  కుమారులు విలియమ్‌, హ్యారీ ఉన్నారు. అయితే, 1992లో చార్లెస్-డయానా  దంపతులు విడిపోయారు. 1997లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డయానా మృతి చెందారు. ఈ విషయంలో చార్లెస్‌ విమర్శలను ఎదుర్కొన్నారు. 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్‌.. కెమెల్లా పార్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.