మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సౌత్ వియత్నాంలో అగ్నిప్రమాదం - 32 మంది మృతి

deadbody
దక్షిణ వియత్నాంలోని కరోకే పార్లర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 32 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటలకు బిన్‌ డుయోంగ్‌ ప్రావిన్స్‌లోని థువాన్‌లో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న పార్లర్‌లో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
 
లోపల చిక్కుకున్న కొంతమంది వినియోగదారులను అగ్నిమాపక దళాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు గాయపడిన వారిలో అధిక శాతం మంది ప్రాణాలు కాపాడుకునేందుకు భవనంపై నుంచి దూకిన వారేనని పేర్కొన్నారు. 
 
మరి కొందరు ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. రెండు లేదా మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని వివరించారు.