సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (10:17 IST)

కార్తికేయ 2కు గుజరాత్ సి.ఎం. భూపేంద్రభాయ్ పటేల్ ప్రశంసలు

nikil, Bhupendrabhai Patel, Abhishek Agarwal
nikil, Bhupendrabhai Patel, Abhishek Agarwal
ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ‌ 2 ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశమంతా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 
 
అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. శ్రీ కృష్ణుడి నేపథ్యంలో వచ్చిన కార్తికేయ 2 సినిమాకు హిందీలోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ కార్తికేయ 2 సినిమా యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత మంచి సందేశాన్ని దేశమంతా చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రత్యేకంగా గుజరాత్ సిఎంను కలిసారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 100 కోట్లకు పైగా వసూలు చేసి ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.