మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (08:12 IST)

ఇంగ్లండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2కు కరోనా

ఇంగ్లండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2కు కరోనా వైరస్ సోకింది. ఎన్నో జాగ్రత్తలు, ఆంక్షల మధ్య ఆమె దినచర్యలు సాగుతున్నప్పటికీ ఆమెకు కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు బకింగ్‌హోం ప్యాలెస్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. 
 
95 యేళ్ల క్వీన్ ఎలిజబెత్ ప్రస్తుతం విండర్స్ కాజిల్ నివాసంలో ఉంటున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆమెకు చికిత్స సాగుతోంది. ఆమె కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు వీలుగా కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తున్నట్టు బకింగ్‌హోం ప్యాలెస్ ప్రకటించింది. 
 
ఇంగ్లండ్ తాజాగా ప్రకటించిన కరోనా మార్గదర్శకాల ప్రకారం ఎవరికైనా కరోనా వైరస్ సోకితే పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచన చేసింది. దీంతో క్వీన్ ఎలిజబెత్‌ కూడా పది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉండనున్నారు. కాగా, ఈ నెల ఆరంభంలో మహారాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కామిల్లా కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే.