సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (22:28 IST)

మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో 41 రోజుల పాటు క‌రోనా!

కరోనాపై తాజాగా షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. మృతదేహంలో కరోనా ఎంతకాలం వుంటుందనే దానిపై జరిపిన పరిశోధనలో.. షాకిచ్చే న్యూస్ తెలిసింది. క‌రోనాతో మృతి చెందిన ఓ వ్య‌క్తి శ‌రీరానికి 41 రోజుల‌పాటు 28 సార్లు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 41 రోజుల‌పాటు మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా ఉన్న‌ట్టుగా ప‌రిశోధ‌కులు నిర్ధారించారు.
 
41 రోజుల‌పాటు త‌రువాత డెడ్‌బాడీని ఖ‌న‌నం చేయ‌డంతో నిర్ధార‌ణ పరీక్ష‌లు చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోయింది. అయితే, మృతి చెందిన వ్య‌క్తి నుంచి క‌రోనా ఇత‌రుల‌కు సోకుతుంద‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఆధారాలు లేవు. 
 
గ‌తంలో మృతి చెందిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా వైర‌స్ 35 గంట‌ల‌కు మించి జీవించి ఉండ‌లేద‌ని తేల‌గా, ఇప్పుడు 41 రోజుల‌పాటు మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్టు నిర్ధార‌ణ‌కు వచ్చారు పరిశోధకులు.