శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:19 IST)

106 రోజుల పాటు బిగ్ బాస్ షో... హౌస్‌లోకి రియల్ కపుల్

Bigg Boss Telugu 6
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ సీజన్‌6 ప్రారంభమైంది. ఈసారి సుమారు 106 రోజుల పాటు ఈ షో సాగనుందని సమాచారం. అలాగే తొలిసారిగా స్టార్‌మా ఛానెల్‌తో పాటు, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. 
 
స్టార్ మా ఛానెల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు, శని-ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్‌గా కనిపిస్తోంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్.. ఇలా ప్రతీది కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది.
 
ఇకపోతే. బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక కలర్‌ఫుల్ కపుల్ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ నటులుగా పాపులర్ అయిన రియల్ కపుల్ మెరీనా రోహిత్ జంట బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
 
పది, 11వ కంటెస్టెంట్స్‌గా ఈ జంట హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ సందేశ్‌, వితికా షెరూ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఒక రియల్ కపుల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడంతో ఈ సీజన్ ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు