బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (13:17 IST)

బిగ్ బాస్ షో ఆరో సీజన్‌లోకి రియల్ సీరియల్ జోడీ మెరీనా, రోహిత్

Marina Abraham-Rohit Sahni
Marina Abraham-Rohit Sahni
తెలుగులో బిగ్ బాస్ షో ఆరో సీజన్‌ను మొదలెట్టబోతున్నారు. దీన్ని సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నారు. ఈ సీజన్‌ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి అయిపోయినట్లు ఇప్పటికే బుల్లితెర వర్గాలు పేర్కొన్నాయి. 
 
దీంతో ఇప్పుడు నిర్వహకులు ప్రారంభ ఎపిసోడ్‌పై దృష్టి సారించారట. అలాగే, కంటెస్టెంట్లను కూడా క్వారంటైన్‌లోకి పంపే ఏర్పాట్లను చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ల ఏవీ షూట్‌లు కూడా జరుపుతున్నారు. అందుకే ప్రేక్షకాదరణ ఉన్న కంటెస్టెంట్లను తీసుకు వస్తున్నారు. 
 
ఇందులో భాగంగానే నిజమైన జంట మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నిని ఈ సీజన్‌ కోసం ఎంపిక చేశారని తెలిసింది. బిగ్ బాస్ షో చరిత్రలో ఒక నిజమైన జంటను హౌస్‌లోకి పంపించిన దాఖలాలు లేవు. 
 
అలాంటిది 2019లో ప్రసారం అయిన మూడో సీజన్‌లో టాలీవుడ్ రియల్ కపుల్ అయిన వరుణ్ సందేశ్, వితిక షేరును కంటెస్టెంట్లుగా తీసుకు వచ్చారు. వాళ్ల తర్వాత ఇప్పుడు సీరియల్ జోడీ మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నిను హౌస్‌లోకి పంపిస్తున్నారని సమాచారం.