సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (21:43 IST)

కలలో స్నానం చేసినట్లుగా వస్తే ఏమవుతుంది?

head bath
కలలు అనేక రకాలుగా వస్తుంటాయి. భయంకరమైన కలలు, ప్రశాంతమైన కలలు, విచిత్రమైన కలలు... ఇలా పలు రకాల కలలు వస్తుంటాయి. ఐతే ఒక్కో కలకు ఒక్కో ఫలితం వుంటుందని జ్యోతిష నిపుణులు చెపుతారు.

 
కొంతమందికి కలలో స్నానం చేసినట్లు వస్తుంది. ఒంటరిగా లేదా... దంపతులు కలిసి స్నానం చేసినట్లు కలలు కంటారు కొందరు. ఇలాంటి కలలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వివరించబడింది.

 
మంచినీటితో స్నానం చేస్తున్నట్లు కల వస్తే... త్వరలో మీకు శుభఫలితాలు రాబోతున్నాయని అర్థం. అలాగే అప్పటివరకూ వున్న అనారోగ్య సమస్యలు వదిలి ఆరోగ్యవంతులవుతారని సూచిస్తాయి. కలలో కాళ్లు కడుక్కున్నట్లు వస్తే... కష్టాల నుంచి గట్టెక్కబోతున్నారని అర్థం.

 
ఐతే మురికినీటిలో స్నానం చేస్తున్నట్లు కల వస్తే మాత్రం జాగ్రత్త పడాలి. ఏదైనా కొత్త వ్యాపారమో, పెట్టుబడులు పెట్టేవారు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది.