సోమవారం, 11 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (14:08 IST)

యుద్ధభూమిలో పెళ్లిళ్ళ జోరు... బతికే ఒక్క రోజైనా జీవిద్దామంటూ...

ukraine couple
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తోంది. గత ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇంకెంతకాలం కొనసాగుతుందో కూడా తెలియదు. మరోవైపు, రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారింది. ఎవరు బతుకుతారో.. ఎవరు ప్రాణాలు కోల్పోతారో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. 
 
ఇలాంటివారిలో చాలా మంది పెళ్లికాని యువకులు కూడా ఉన్నారు. వీరు భార్యాభర్తలుగా చనిపోవాలని భావిస్తున్నారు. అందుకే తమకు నచ్చిన వరుడు లేదా వధువును పెళ్లి చేసుకుంటున్నారు. ఫలితంగా మరుభూమిగా మారిన ఉక్రెయిన్‌లో జోరుగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. 
 
ఒక్క ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరంలోనే కొన్ని రోజుల్లోనే ఏకగా నాలుగు వేల జంటలు పెళ్ళిళ్లు చేసుకున్నాయి. పరిస్థితులు చక్కబడితో జీవనం కొనసాగిస్తామని లేదంటే భార్యాభర్తలుగా కలిసి చనిపోతామని కేథరినా లైట్వినెంకో, ఇహార్ జాక్వాట్ స్కీ అనే ప్రేమ జంట తీవ్ర భావోద్వేగంతో చెప్పారు. 
 
వీరిద్దరూ కీవ్ నగరంలోని ఓ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. అదేసమయంలో దరఖాస్తు చేసుతున్న రోజే పెళ్లి చేసుకునేందుకు వివాహం చేసుకునేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. గతంలో అయితే ఈ అనుమతి నెల రోజులుకు కూడా వచ్చేదికాదు.