శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (18:35 IST)

కార్యకర్తల వివాహాలకు నారా లోకేశ్ పెళ్లి కానుక

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యకర్తల వివాహాలకు హాజరుకాలేక పోవడంతో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని టీడీపీ కార్యకర్తల వివాహాలకు హాజరుకావాలని కార్యకర్తలు కోరుతున్నారు. వాటికి కూడా ఆయన హాజరుకాలేక పోతున్నారు. దీంతో పార్టీ కార్యకర్తల పెళ్లిళ్ళ సమయంలో వధూవరులకు పెళ్లి కానుకను పంపించనున్నారు. 
 
ఈ కానుకలో వరుడుకి తెల్ల ఫ్యాంట్, చొక్కా, వధువుకు తలంబ్రాల చీరను బహుకరించనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పెళ్లి చేసుకునే కార్యకర్తలందరికీ ఈ కానుకలను నారా లోకేశ్ తరపున పార్టీ నేతలు స్వయంగా అందజేస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఆయన మళ్లీ ప్రజలకు చేరువయ్యేందుకు ఈ వినూత్న కానుక పంపిణీకి శ్రీకారం చుట్టారు.