1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సంక్రాంతి సంబరాల కోసం కారంచేడుకు బాలయ్య దంపతులు

తెలుగు ప్రజల అతిముఖ్యమైన పండుగల్లో ఒకటై సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలంతా కోలాహలంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ కోసం దేశ విదేశాల్లో ఉన్న ప్రజలంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్ళారు. అయితే, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తన సతీమణితో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు వచ్చారు. తన అక్కాబావలైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబంతో కలిసి వారు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. 
 
నిజానికి ప్రతియేటా నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంతమంది దగ్గుబాటి కుటుంబ సభ్యులు కలిసి ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. దగ్గుబాటి ఇంట జరిగే వేడుకలకు బాలకృష్ణ భార్య వసుంధర వచ్చేవారు. కానీ, బాలకృష్ణ వచ్చేవారు కాదు. 
 
అయితే, ఈ దఫా మాత్రం బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ ఫ్యామిలీ సభ్యులంతా కలిసి తన అక్కాబావల ఊరైన కారంచేడుకు వచ్చారు. దీంతో గ్రామస్తులతో పాటు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే, కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో ఎవరినీ ఆయన నివాసంలోకి అనుమతించలేదు.