తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్- త్వరలోనే మా బేబీ రానుంది..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్- రణ్‌బీర్ కపూర్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మేరకు తాజాగా అలియా-రణ్ బీర్ దంపతులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి కాబోతున్నట్లు ఫోటోలను పోస్ట్ చేసింది అలియా.
హాస్పిటల్‌లో స్కాన్ మానిటర్ చూపిస్తూ.... ఓ ఫోటోను షేర్ చేసింది. రణభీర్ కపూర్‌తో డాక్టర్ చెకప్ చేస్తున్నప్పటి ఫొటోను ఆమె షేర్ చేస్తూ మా బేబి త్వరలోనే రానుందంటూ తెలియజేశారు.
దీనిపై రకుల్ ప్రీత్ సింగ్, కరణ్‌జోహార్, మౌనీ రాయ్ వంటి పలువురు సెలబ్రెటీలు అభినందనలు తెలుపుతున్నారు. కాగా రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌లు ఏప్రిల్ 14న ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.