గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (18:23 IST)

పబ్లిక్‌లో బిగ్ బాస్ ప్రేమికుల లిప్ లాక్.. వీడియో వైరల్

Tejasswi Prakash, Karan Kundrra,
Tejasswi Prakash, Karan Kundrra,
హిందీ బిగ్ బాస్ షోలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ ద్వారా దివంగత నటుడు సిద్దార్థ్‌ శుక్లా- షెహనాజ్‌(సిద్‌నాజ్‌) జంట, కరణ్‌ కుంద్రా - తేజస్వి ప్రకాశ్‌(తేజ్‌రాణ్‌) జంటలు బాగా పాపులర్‌ అయ్యాయి. తాజాగా ఈ జంట వార్తల్లో నిలిచింది. తాజాగా వీళ్లిద్దరూ పబ్లిక్‌లో ముద్దులాట ఆడారు. 
 
ఆదివారం బాలీవుడ్‌ నిర్మాత వెనెస్సా వాలియా బర్త్‌డే పార్టీకి హాజరైన ఈ ప్రేమపక్షులు కెమరాలేవీ తమను చూడటం లేదనుకున్నారో ఏమోకానీ ముద్దుల్లో మునిగిపోయారు.
 
అయితే చివర్లో ఇదంతా వీడియో తీస్తున్నారని అర్థమవగానే దయచేసి పోస్ట్‌ చేయొద్దని కోరింది 'నాగిని' బ్యూటీ. కానీ ఆమె ప్రియుడు కరణ్‌ కుంద్రా మాత్రం ప్లీజ్‌ పోస్ట్‌ చేయండని కోరాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా ఈ వీడియోపై పోస్టులు పెడుతున్నారు.