గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (12:04 IST)

బిగ్ బాస్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. సెప్టెంబరులో ప్రారంభమవుతుందా?

big boss
బిగ్ బాస్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ ముగిసిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఓటీటీ అట్టర్ ఫ్లాప్ కావడంతో కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు షో నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు నిర్వాహకులు.
 
బిగ్ బాస్ షో హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్ల ఎంపికని బట్టే ఉంటుంది. అందువల్లే షో నిర్వాహకులు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అలాగే బిగ్ బాస్ ఓటీటీలో మిస్సయిన ఎంటర్టైన్మెంట్‌ను కూడా బాస్ సీజన్-6లో ప్రేక్షకులకు అందించాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు. 
 
ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4, 2022 ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
అయితే కేవలం సెప్టెంబర్‌లో నెలలోనే ఎందుకూ అంటే గతంలో టాప్ రేటింగ్ కొల్లగొట్టింది కూడా ఈ సెప్టెంబర్ సెంటిమెంట్‌తోనే నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ 4 రికార్డ్ స్థాయిలో టీఆర్పీ సాధించింది.
 
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ సాధించింది ఈ సీజన్‌లోనే నాగార్జున హోస్ట్ చేసిన తొలి సీజన్ పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి 21.7 TVR రేటింగ్ సాధించింది. అందుకే ఆరో సీజన్ కూడా సెప్టెంబరులో ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.