గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (18:03 IST)

స్కూటీపై చక్కర్లు కొట్టిన విరుష్క జోడీ..

anushka - kohli
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ స్కూటీపై చక్కర్లు కొట్టారు.  సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను వారెప్పుడు పోస్టు చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాను, కోహ్లీ అభిమానులను ఊపేస్తోంది. 
 
తమను ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్లు తగిలించుకున్న కోహ్లీ, అనుష్క ఆపై స్కూటరెక్కి ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. స్కూటర్‌ను కోహ్లీ స్మూత్‌గా డ్రైవ్ చేస్తుంటే వెనక అనుష్క అతడిని పట్టుకుని కూర్చుంది. వర్షం పడేలా ఉండడంతో ఓ గొడుగును కూడా పట్టుకున్నారు. వీరిని కొందరు మాత్రం వారిని గుర్తించి ఫోటోలు, వీడియోలు తీయడం మొదలెట్టారు. 
 
కోహ్లీ బ్లాక్ ప్యాంట్, గ్రీన్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ధరించగా, అనుష్క బ్లాక్ కలర్ ట్రాక్ సూట్ ధరించింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా విరుష్క జంటను క్యూటెస్ట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.