సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (19:44 IST)

ఆసియా కప్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

Bharat-Pakistan
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4 లీగ్‌ విభాగంలో రెండో మ్యాచ్ ఆదివారం రాత్రి జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌ చేయపట్టనుంది. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో స్వల్ప మార్పులుచేసింది భారత తుది జట్టుకు ఎంపిక చేసినవారిలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హూడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్‌లు ఉన్నారు. 
 
అలాగే, పాకిస్థాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్, ఫక్తర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, మహ్మద్ హోస్నైన్, నజీం షాలకు తుది జట్టులో చోటు కల్పించారు.