గాసిప్‌కు సమాధానం సీజన్2 అంటూ ఫుల్ మేకప్‌తో అనసూయ
యాంకర్, నటి అనసూయ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన గురించి తను ఏమి అనుకుంటుందో ఇతరుల గురించి తెగ మాట్లాడేడి సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ గురించి లైగర్ సినిమా నెగెటివ్ టాక్ వస్తే దాన్ని కూడా స్వలాభానికి వాడుకుంది. దానికి విమర్శలు వస్తే వారిపై కేసు పెడతానంది. అంటే ఇతరుల గురించి ఆమె మాట్లాడితే తప్పుకాదా! అంటూ కొందరు ఏకిపారేశారు.
ఇదిలా వుండగా, తాజాగా స్మార్ట్‌గా వున్న ఫేస్‌తో ఏదో జ్యూస్‌లాంటిది తాగుతూ.. నా గురించి, నాపై వచ్చే గాసిప్ గురించి మరిన్ని తెలుసుకోవాలంటే మీకు సీజన్2 ద్వారా సమాధానం చెబుతానంటూ చిన్న వీడియో పోస్ట్ చేసింది. సీజన్2 ఈజ్ కమింగ్ అంటూ చెప్పిన ఆమె మాటలు సరైన క్లారిటీ లేకపోయినా ఇండస్ట్రీలో మాత్రం తను బిగ్‌బాస్ 6 సీజన్‌లో పాల్గొనబోతోందని తెలుస్తోంది. అయితే ఈ వీడియోను పలువురు నెటిజన్లు స్పందించారు. ఫుల్ మేకప్‌తో వుందని కొందరంటే ఆంటీ కళ్ళజోడు మిస్ అయిందని మరికొందరు కామెంట్ చేశారు.
హౌస్‌లో కొద్దిరోజులు వుండి తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తుందని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే సింగర్ స్మిత తాను బిగ్‌బాస్‌కు వెళ్లడంలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే బిగ్‌బాస్‌లో ఏమంత ఎట్రాక్ట్ పర్సన్స్ రాలేదని టాక్ నెలకొంది. ఈ సీజన్‌లో కొత్త ప్రక్రియ మొదలుపెట్టారు. దాంతో వైట్ గార్డ్ వస్తుందని దాని ద్వారా బిగ్‌బాస్‌లోకి వెళ్ళబోతున్నట్లు సూచాయగా చెప్పినట్లుంది. సో. ఆమె అభిమానులకు, నెటిజన్లుకు కనులవిందుగా కనిపిస్తోందేమో చూడాలి.