సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 31 ఆగస్టు 2022 (22:10 IST)

'లైగర్' పైన చార్మీ ఏమన్నదో తెలుసా? ఆ వీడియోలో కుక్క కూడా తట్టుకోలేకపోయింది...

charmy kaur
భారీ అంచనాల మధ్య విడుదలయిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. సుమారుగా రూ. 170 కోట్ల భారీ బడ్జెట్టుతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ప్రమోషన్ సమయంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్యపాండే కాళ్లకు బలపాలు కట్టుకుని దేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యటించారు. వీరు పర్యటించేందుకు వెళ్లినచోట ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇద్దర్ని చూసేందుకు పోటాపోటీగా ఎగబడ్డారు. కానీ లైగర్ సినిమాను చూసేందుకు మాత్రం ఆ స్థాయిలో రాలేదు మరి. దీనితో చిత్రంపై కాస్తా డివైడ్ టాక్ వచ్చింది.

 
ఈ నేపధ్యంలో నటి చార్మి చిత్రం ఫ్లాప్ టాక్ పైన మాట్లాడింది. దాదాపుగా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి చిత్రాన్ని నిర్మించామనీ, ఐతే ఫ్లాప్ టాక్ రావడం బాధగా వుందని అన్నారు. ప్రజలు ఇప్పుడు సినిమాను ఇంట్లో కూర్చుని చూస్తున్నారనీ, సినిమాలో కంటెంట్ బాగుందని చెబితేనే ఇంట్లో నుంచి కదులుతున్నారంటూ వ్యాఖ్యానించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చిత్రం పరిస్థితి మరింత ఘోరంగా వుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

 
ఇదిలావుంటే లైగర్ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ విడుదలయినప్పుడు చార్మీ తన ఇన్ స్టాగ్రాంలో ఓ వీడియోను పోస్ట్ చేసారు. అందులో విజయ్ దేవరకొండ బాక్సింగ్ సీన్స్ చూసి తట్టుకోలేకపోయింది. ఈ వీడియో చూడండి...