ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (19:49 IST)

తమిళనాట "కోబ్రా" సందడి... ప్రీమియర్ షోలలో పాజిటివ్ టాక్

Cobra
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం "కోబ్రా". అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. నిర్మాత ఎస్ఎస్ లలిత్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 31వ తేదీ వినాయకచవితి సందర్భంగా విడుదల చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో విక్రమ్ అనేక విభిన్న పాత్రల్లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేయనున్నారు. ఇందులో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రతినాయకుని పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటే ఇందులో విక్రమ్ లెక్కల మాస్టర్‌గా కోబ్రా అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ అని అర్థమవుతోంది. 
 
ఈ మూవీలో మృణాళిని, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. మంగళవారం విదేశాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.