ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (17:41 IST)

సోహైల్ లక్కీ లక్ష్మణ్ నుంచి సాంగ్ ప్రోమోకు ఆద‌ర‌ణ‌

Sohail, Moksha
Sohail, Moksha
హీరో సోహైల్  అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తరువాత సోహైల్ చేస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్ ". దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే  విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని "ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ లిరికల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్ .
 
ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..
ఓ మేరీ జాన్ వెనకే నీతో వస్తూ.. ఉన్నదే..
ఓ మేరీ జాన్  నిన్నే.. వదిలి వదిలి ఉండ నన్నదే
అంటూ సాగే లవ్ సాంగ్ చాలా క్లాసీ గా ఇంట్రెస్ట్ గా ఉంది. హీరో సోహైల్  డ్యాన్స్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఈ పాటను ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాశారు. సింగర్ అనురాగ్ కులకర్ణి చ‌క్క‌గా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డి ఓ పి ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వస్తున్న మరో క్రేజీ సాంగ్ ఈ  “ఓ మేరీ జాన్”. ఈ ప్రోమో సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9:33 గంటలకు విడుదల చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి.
 
ఈ సందర్బంగా చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ఇంతకుముందు మా చిత్రం నుండి విడుదలైన "అదృష్టం హలో అంది రో చందమామ" టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ కు, సాంగ్ ప్రోమో కు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం విషయానికి వస్తే  చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. ఈ చిత్రం నుండి విడుదల చేసిన  “ఓ మేరీ జాన్” ప్రోమో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
పూర్తి పాటను సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9:33 గంటలకు విడుదల చేస్తున్నాం. సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించిన ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో నే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అన్నారు.
లక్కీ లక్ష్మణ్ పాటలు టిప్స్ ఆడియో ద్వారా విడుదలయ్యాయి.
 
నటీనటులు
సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు
 
సాంకేతిక నిపుణులు-  బ్యానర్స్ – దత్తాత్రేయ మీడియా, నిర్మాతలు – హరిత గోగినేని, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – ఏఆర్ అభి, సంగీతం – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్, 
ఆర్ట్ డైరెక్టర్ – చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయానంద్. కీత, పీఆర్వో – నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ – టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ – ఓవర్ 7 ప్రొడక్షన్స్