గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 మే 2022 (12:16 IST)

సోహైల్ చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ నుంచి వీడియో గ్లింప్స్

Mr. Pregnant,
Mr. Pregnant,
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో  సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.  రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. 
 
మదర్స్ డే సందర్భంగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.  ఈ వీడియో గ్లింప్స్ లో అమ్మ గురించి సుహాసిని, సొహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 9 నెలల కష్టాన్ని నవ్వుతూ భరించి, ప్రాణాలకు తెగించి ఓ బిడ్డకు జన్మనిస్తారు. ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్ అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఉద్వేగంగా ఉంది.
హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తుది దశలో ఉన్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
 
నటీనటులు : సొహైల్ , రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం,
రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు
సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ - నిజార్ షఫీ, సంగీతం - శ్రావణ్ , ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యానర్ - మైక్ మూవీస్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, రచన-దర్శకత్వం - శ్రీనివాస్ వింజనంపాటి