సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:46 IST)

భద్రాచలంలో అమానుష ఘటన: గర్భిణిపై అత్యాచారయత్నం

మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని భద్రాచలంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. 
 
డెవలరీ కోసం వచ్చిన ఓ మహిళపై ఆపరేషన్ థియేటర్‌లో అత్యాచారయత్నం చేశాడు. మత్తుమందు ఇచ్చి గర్భిణీపై ఎమ్‌ఎన్‌ఓ లాల్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
అయితే గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా చూసిన మరో ఉద్యోగి.. అతడిని అడ్డుకుని లాల్ ఖాన్‌పై సూపరిడెంట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆసుపత్రి సూపర్డెంట్ ఎంఎన్‌వోకు లాల్ ఖాన్‌కు మెమో జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.